Thursday, June 28, 2012

EE vela

జాబిలమ్మ  జోల  పాట  పాడే  వేళ
కనుపాపలు నిదురంచులు  తాకే  వేళ

కొమ్మలు  చిరుగాలి ఊయలూగే వేళ
కన్నులు కలల లోకం చేరే వేళ

చీకటి తలుపులు రాతిరి తెరిచే వేళ
మది తలపులు అలసిపోయి ఆగే వేళ

తార తీరం కలవరించి చూసే వేళ
ఊహల రెక్కలు ఒడిలో వాలే వేళ

మెల్లగా ఆలోచన అడుగులు తప్పే వేళ
నిండారా నిదుర నన్ను లాలించే వేళ
                                 

Tuesday, June 26, 2012

Sandesam

నిలుస్తుందా  గడిచే  సమయం
ఆగదంతే  కదిలే  కాలం

తెలుస్తుందా  రేపటి  గమనం
తెలిసినదొకటే  ఈనాటి  పయనం

అలుస్తుందా  ఆశల  గమ్యం
సాగాలంతే  ఈ  ప్రయాణం

నడిపిస్తుందా  నీలో  స్థ్హైర్యo
చేరాలంటే  కోరిన  తీరం

ఫలియిస్తుందా  ప్రతి  ప్రయత్నం
గెలవాలంటే  ఈ  పోరాటం

ప్రశ్నిస్తుందా  సమాధానం  
తెలియాలంటే ఈ  పాఠం

సరిపోతుందా  ఒక్క  జీవితం
ఇవ్వాలంటే  ఈ సందేశం

 

Tuesday, June 19, 2012

Morning Raaga


The soothing comfort of cool breeze
The serene beauty of nature's cast
The dry scent of summer fragrance
The supple folds of endless sky
The sublime shades of orange hues
The pleasant color of golden light
The mottled landscape of desert turf
The subtle shadows of rocky hills
The glowing patterns of urban sets
The rising glory of morning sun

vivacious yet simple..
urban yet rustic..

Sunday, June 17, 2012

Na Presna

ఉహలు చేరని తీరముందా ?
కలలు చూడని లోకముందా ?

ఆశలు తెలియని ఆలోచనుందా ?
మనసు కలవని  భావముందా ?

పరుగులెరుగని  కోరికుందా ?
పయనమెరుగని పాదముందా ?

ఆరాటానికి అందని వేగముందా ?
వెలుగుకి కనిపించని చీకటుందా ?

నేటికి మించి నిజముందా ?
ఆనందానికి మించి గెలుపుందా ?

కాలం పరిచెయమవ్వని క్షణముందా ?
సమయం పలకరించని తలపుందా ?

ఈ ప్రశ్నకి బదులుందా ?
ఆ బదులుకి పలుకుందా ?

ఐతే పలుకుకి మాటుందా ?
ఆ మాటకి భాషుందా ?

Tuesday, June 5, 2012

I

clarity begins with confusion
change begins with thought
solution begins with quest
success begins with failure
growth begins with fall
Identity begins with "I"

clarity empowers
change drives
solution elicits
success defines
growth projects
Identity leads...