Thursday, October 13, 2011

okka kshnamaina chaalu

ఒక్క క్షణమైనా చాలు
రెక్కలతో ఆకాశానికి ఎగిరెళితే
నడకలతో సెలయేటికి ఎదురెళితే

ఒక్క క్షణమైనా చాలు
విరివొడిలో తేనెలతో ఒదిగుంటే
మబ్బులలో చినుకులతో ఆడుకుంటే

ఒక్క క్షణమైనా చాలు
కడలిలో అలలతో పరుగెడితే
జాబిలిలో చుక్కలతో పడుకుంటే

ఒక్క క్షణమైనా చాలు
కొమ్మలలో కోయిలతో ఆడుకుంటే
గాలులలో పువ్వులతో నవ్వుకుంటే

ఒక్క క్షణమైనా చాలు ...

Wednesday, October 5, 2011

.....

నింగే వంగి నేలపై వాలిందా
కదలియై పొంగి నీరై పారిందా

మబ్బే మురిసి వానై కదిలిందా
చినుకై కురిసి ముత్యమై ఒదిగిందా

రంగే కరిగి రెక్కలపై కారిందా
గంధమై చేరి పువ్వై పూసిందా

జాబిలే జారి పుడమిపై రాలిందా
మల్లెలై నవ్వి , కమలమై విరిసిందా

చీకటే వెలుగై వెన్నెలై వచ్చిందా
తారలై మెరిసి రాతిరై కొలువుందా

తురుపే రాగమై ఉదయమై పాడిందా
కిరణమై పలికి వేకువై పిలిచిందా

చిరుగాలే  భావమై  తాళమై ఆడిందా
పరుగులై సాగి విహంగమై ఎగిరిందా

కాలమే చలనమై ఋతువులై మారిందా
వసంతమై వచ్చి శిశిరమై వెళ్ళిందా