Tuesday, September 20, 2011

Makara Sankranthi

వేకువ వెలుగుల భోగిమంట పుత్తళ్ళు
అందాల సిరులొ లుకు అలికిన వాకిళ్ళు

ముగ్గులు దిద్దిన రంగుల ముంగిళ్ళు
సిగ్గులు ఒలికించు గొబ్బిళ్ళ లోగిళ్ళు

పువ్వుల నవ్వుల పచ్చని పందిళ్ళు
వేడుక వేళల తరగని సందళ్లు

అంబరా ల సంబరాల పొంగుల ఉరవళ్ళు
మకర సంక్రాంతి పండుగ పరవళ్లు 

Wednesday, September 14, 2011

Rangula harivillu

అల్లంత దూరాల అంబర వర్ణం, నీలం
లేలేత పరువాల విరిసిన వసంతం, పచ్చ

చినుకులు దాగిన మబ్బుల నయనం , నలుపు
చుక్కలు ఒదిగిన వెన్నెల తీరం , తెలుపు

ఉషా కిరణాల వేకువ కావ్యం ,పసుపు
సంధ్యా రాగాల వెలుగుల రూపం ,ఎరుపు 

Tuesday, September 13, 2011

Ansika (meaning beautiful)

ఏ ఉదయ కిరణాల కమలిని నీవో
ఏ అంబర వర్ణాల సాహితి నీవో

ఏ సాగర తీరాల లాహిరి నీవో
ఏ సంధ్యా రాగల పల్లవి నీవో

ఏ  పూల  గంధాల  హాసిని నీవో
ఏ కొమ్మ గొంతుల శ్రావణి నీవో

ఏ వాన మబ్బుల మెరుపువి నీవో
ఏ జల్లుల చినుకుల  పిలుపువి నీవో

ఏ కోయిల పాటల ఆమని నీవో 
ఏ గాలుల  వీణల తీగవి నీవో

ఏ కన్నుల  కలల రాగిణి నీవో
ఏ రంగుల ముగ్గుల హరివిల్లువి నీవో

ఏ వలపుల కోవెల వెలుగువి నీవో
ఏ వెన్నెల  కాంతుల సోగసువి నీవో

ఏ ఊహాల చిత్రాల రేఖవి  నీవో
ఏ మల్లెల నవ్వుల యామిని నీవో

ఏ మువ్వల పదముల రవళి వి నీవో
ఏ  తలపుల కవితల వాణివి నీవో

నడిపావు కాలం స్పందనై
నిలిపావు ప్రాణం ఊపిరై

మెరిసావు గగనాన తారాకై
మెదిలావు  హృదయాన దీపమై

Monday, September 12, 2011

Swaranjali

వేద మంత్రాల
ప్రణవ ధ్వానాల
మధుర రాగల
సారణి , శివరంజని

చిలుక పలుకుల
నదుల నడకల
లతల కులుకుల
పావని , హంసధ్వని

అంబర తీరాల
వెన్నెల వాకిళ్ళ
అలల పరువాల
ఆమని ,అమృత వర్షిణి 

భ్రమర నాదాల
గంగ పొంగుల
గాన ధారల
వాహిని , ఆనందభైరవి 

విరుల పవనాల
కమల నయనాల
కుసుమ వైనాల
రాగిణి, కీరవాణి 

అంజలితో సంగీత సాహితి కి  అంకితం.


Sunday, September 11, 2011

Vennela

పాల తరకల
వెండి పలకల
మంచు తొనకల
పండు వెన్నెల

గగన వీధిలో
మబ్బు దారిలో
కడలి వాగులో
సాగి వెన్నెల

జోల పాటలో
గోరు ముద్దలో
పసిడి నవ్వులో
కరిగి వెన్నెల

ఇసుక తిన్నెలో
అలల నీటిలో
లతల గాలిలో
కలిసి  వెన్నెల

విరుల  వొడిలో
కలల మదిలో
కనుల నదిలో
వాలి వెన్నెల

ఉప్పొంగెను
పరుగాపెను
నిదురించెను
సిరివెన్నెల 

 -- రేయిని అలరించే ప్రతి పౌర్ణమికి ఇది అంకితం

Wednesday, September 7, 2011

RutuRaagalu


ఉదయించెను భాను కిరణం
వికసించెను కుసుమ నయనం
ప్రకాశించెను స్వర్ణ వర్ణం
మరపించెను శుభోదయం

వర్షించెను గగన మేఘం
చుంబించెను పుడమి అధరం
పులకించెను కడలి హృదయం
హర్షించెను విరిమధురం 


కదలొచ్చెను వన వసంతం
పలికించెను విహంగ రాగం
వినిపించెను అమృత గీతం
అలరించెను ప్రాకృతి వైనం 

లాలించెను శ్రవణ చంద్రం
పలకరించెను పవన భాస్యం
మురిపించెను కలల తీరం
కనువాల్చెను సుమనేత్రం 

Tuesday, September 6, 2011

Color

It soaks the depths of endless sky
It fills the folds of early dawn
It adorns the curls of fragile petals
It coats the strands of tender leaves
It paints the feathers of radiant wings
It shades the sheets of clear waters
The chord that strikes nature's art-- "Color"

Monday, September 5, 2011

Serenity

As the wind kisses the flowers
in a gentle light swing
As the bloom fills the spring
in a sweet floral fragrance

As the waves cuddle the rocks
in a soft wet embrace
As the rain soaks the leaves
in a tender lucid dew

As the sun paints the sky
in a rich colorful shade
As the moon soothes the night
in a silent tacit tranquility

A serene feeling befalls me
taking me to the eternal heaven of bliss