ఏ ఉదయ కిరణాల కమలిని నీవో
ఏ అంబర వర్ణాల సాహితి నీవో
ఏ సాగర తీరాల లాహిరి నీవో
ఏ సంధ్యా రాగల పల్లవి నీవో
ఏ పూల గంధాల హాసిని నీవో
ఏ కొమ్మ గొంతుల శ్రావణి నీవో
ఏ వాన మబ్బుల మెరుపువి నీవో
ఏ జల్లుల చినుకుల పిలుపువి నీవో
ఏ కోయిల పాటల ఆమని నీవో
ఏ గాలుల వీణల తీగవి నీవో
ఏ కన్నుల కలల రాగిణి నీవో
ఏ రంగుల ముగ్గుల హరివిల్లువి నీవో
ఏ వలపుల కోవెల వెలుగువి నీవో
ఏ వెన్నెల కాంతుల సోగసువి నీవో
ఏ ఊహాల చిత్రాల రేఖవి నీవో
ఏ మల్లెల నవ్వుల యామిని నీవో
ఏ మువ్వల పదముల రవళి వి నీవో
ఏ తలపుల కవితల వాణివి నీవో
నడిపావు కాలం స్పందనై
నిలిపావు ప్రాణం ఊపిరై
మెరిసావు గగనాన తారాకై
మెదిలావు హృదయాన దీపమై
ఏ అంబర వర్ణాల సాహితి నీవో
ఏ సాగర తీరాల లాహిరి నీవో
ఏ సంధ్యా రాగల పల్లవి నీవో
ఏ పూల గంధాల హాసిని నీవో
ఏ కొమ్మ గొంతుల శ్రావణి నీవో
ఏ వాన మబ్బుల మెరుపువి నీవో
ఏ జల్లుల చినుకుల పిలుపువి నీవో
ఏ కోయిల పాటల ఆమని నీవో
ఏ గాలుల వీణల తీగవి నీవో
ఏ కన్నుల కలల రాగిణి నీవో
ఏ రంగుల ముగ్గుల హరివిల్లువి నీవో
ఏ వలపుల కోవెల వెలుగువి నీవో
ఏ వెన్నెల కాంతుల సోగసువి నీవో
ఏ ఊహాల చిత్రాల రేఖవి నీవో
ఏ మల్లెల నవ్వుల యామిని నీవో
ఏ మువ్వల పదముల రవళి వి నీవో
ఏ తలపుల కవితల వాణివి నీవో
నడిపావు కాలం స్పందనై
నిలిపావు ప్రాణం ఊపిరై
మెరిసావు గగనాన తారాకై
మెదిలావు హృదయాన దీపమై
telugu koodana!!..must say..u r multi talented!!
ReplyDelete