సిరిమల్లెల గంధం
చిరుగాలికి సొంతం
ఆ చిరుగాలి పయనం
ఏ గూటికి సొంతం ?
సిరివెన్నెల అందం
నిశీధికి సొంతం
ఆ నిశీధి మాత్రం
ఏ రేయికి సొంతం ?
సిరిమువ్వల పాదం
నాట్యానికి సొంతం
ఆ నాట్యం లాస్యం
ఏ భావానికి సొంతం?
సిరిపైరుల భోగం
ఈ నేలకి సొంతం
ఆ నేల గగనం
ఏ చేనుకి సొంతం ?
సిరిజల్లుల శ్రావ్యం
శ్రావనానికి సొంతం
ఆ శ్రావణ మాసం
ఏ మబ్బుకి సొంతం ?
చిరుగాలికి సొంతం
ఆ చిరుగాలి పయనం
ఏ గూటికి సొంతం ?
సిరివెన్నెల అందం
నిశీధికి సొంతం
ఆ నిశీధి మాత్రం
ఏ రేయికి సొంతం ?
సిరిమువ్వల పాదం
నాట్యానికి సొంతం
ఆ నాట్యం లాస్యం
ఏ భావానికి సొంతం?
సిరిపైరుల భోగం
ఈ నేలకి సొంతం
ఆ నేల గగనం
ఏ చేనుకి సొంతం ?
సిరిజల్లుల శ్రావ్యం
శ్రావనానికి సొంతం
ఆ శ్రావణ మాసం
ఏ మబ్బుకి సొంతం ?
No comments:
Post a Comment