Thursday, June 28, 2012

EE vela

జాబిలమ్మ  జోల  పాట  పాడే  వేళ
కనుపాపలు నిదురంచులు  తాకే  వేళ

కొమ్మలు  చిరుగాలి ఊయలూగే వేళ
కన్నులు కలల లోకం చేరే వేళ

చీకటి తలుపులు రాతిరి తెరిచే వేళ
మది తలపులు అలసిపోయి ఆగే వేళ

తార తీరం కలవరించి చూసే వేళ
ఊహల రెక్కలు ఒడిలో వాలే వేళ

మెల్లగా ఆలోచన అడుగులు తప్పే వేళ
నిండారా నిదుర నన్ను లాలించే వేళ
                                 

No comments:

Post a Comment