ఉహలు చేరని తీరముందా ?
కలలు చూడని లోకముందా ?
ఆశలు తెలియని ఆలోచనుందా ?
మనసు కలవని భావముందా ?
పరుగులెరుగని కోరికుందా ?
పయనమెరుగని పాదముందా ?
ఆరాటానికి అందని వేగముందా ?
వెలుగుకి కనిపించని చీకటుందా ?
నేటికి మించి నిజముందా ?
ఆనందానికి మించి గెలుపుందా ?
కాలం పరిచెయమవ్వని క్షణముందా ?
సమయం పలకరించని తలపుందా ?
ఈ ప్రశ్నకి బదులుందా ?
ఆ బదులుకి పలుకుందా ?
ఐతే పలుకుకి మాటుందా ?
ఆ మాటకి భాషుందా ?
Good one.. :)
ReplyDelete